Wednesday, July 25, 2012

మీ జీవితంలో మీకు ఏమి కావాలి?

సంపూర్ణ ఆరోగ్యం కావాలా?
ఉన్నతమైన జీవితం కావాలా?
మనశ్శాంతి, ప్రశాంతత, ఆనందం కావాలా?
ఆత్మవిశ్వాసం కావాలా?
ధైర్యం కావాలా?
ఙ్ఞాపకశక్తి పెంచుకోవాలా?
పాజిటివ్ ఆలోచనలు కావాలా?
ఇంటర్వ్యూ బాగా చేయాలా? 
కోపం తగ్గించుకోవాలా?
ఆర్థికంగా బాగా ఎదగాలా?
మంచి జాబ్ కావాలా?
మంచి మార్క్స్ కాని మంచి ర్యాంక్ కాని కావాలా? 
మీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు బాంగుడాలా?  
వయస్సు పెరుగుతోందని భయపడుతున్నారా? 
ఆకర్షణీయంగా కనపడాలా?
మీ కర్మలను తొలగించుకొవాలా? 
ఆత్మఙ్ఞానం పొందాలా?
కుటుంబ కలహాల నుంచి విముక్తి చెందాలా?
ఇంకా ఎన్నెన్నో సమస్యలనుండి విముక్తి కావాలా?
వీటన్నింటికి పరిష్కార మార్గం "ధ్యానం" చేయడమే 
------

                 ముందుగా ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం తరువాత ధ్యానం ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎవరు చేయాలో పూర్తి వివరాలతో ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ  బ్లాగును కమర్షియల్ కోసం క్రియేట్ చేయలేదు. ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని కోరుతూ, ఆనందంగా, ఐశ్వర్యవంతుడిగా జీవనంసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఎదిగి జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించాలని కోరుకుంటూ ఈ బ్లాగు క్రియేట్ చేయటం జరిగింధి.

                            "ఈ రోజు నేను ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో జీవిస్తున్నాను" నాలాగే ఎందరో ధ్యానులు వారి జీవితాలని సుఖమయం చేసుకున్నారు. మీరు కూడా మీ జీవితాలని సుఖమయం చేసుకోవాలని కోరుతున్నాను.                                     
ధ్యానం
               ఈ మహా విశ్వమంతా "విశ్వ శక్తి" తో నిండి వుంటుంది. దీనినే కాస్మిక్ ఎనెర్జీ అని మరియు ప్రాణ శక్తి అని కూడా అంటారు. విశ్వంలోని గ్రహాలు, మనుషులు, చెట్లు, అణువులు, పరమాణువులు వాటి మధ్య వున్న శక్తి ఈ "విశ్వ శక్తే" . నిద్రలోనూ, సంపూర్ణ నిశ్శబ్దంలోనూ మనం ఈ విశ్వశక్తిని కొద్దిగా మాత్రమే పొందుతున్నాం. అలా పొందిన విశ్వశక్తిని మన దినచర్యలలోని అన్ని శారీరిక కార్యక్రమాలకు మరియు మానసిక కార్యక్రమాలకు వాడుతున్నాము. నిద్రలో పొందే ఈ పరిమిత శక్తి అన్ని పనులకు సరిపడదు. తద్వారా అన్నిరకాల మానసిక, శారీరక రుగ్మతలు వస్తున్నాయి. 

                 ఈ మానసిక, శారీరక రుగ్మతల నుండి విముక్తి పొందడానికి ఏకైక సాధనం "ధ్యానం". ఈ ధ్యానం వలన ఆలోచనారహిత స్థితిలో ఉండటం జరుగుతుంది,   స్థితిలో అనంతమైన విశ్వమయ ప్రాణశక్తిని పొందుతాము. ఈ విశ్వమయ ప్రాణశక్తిని పొందడము ద్వారా మన శరీరంలోని 2,72,000 నాడులు శుద్ది జరిగి తద్వారా మనలోని శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు తొలగి 1. సంపూర్ణ ఆరోగ్యం (Total Health) 2. మానసిక ప్రశాంతత (Mental Peace) 3. బుధ్ది కుశలత (Enhanced Intellect) 4. నైపుణ్యము (Efficiency) 5. ఆత్మ సంయమనము (Self Control) 6. ఏకాగ్రత (Concentration) 7. ఆత్మ విశ్వాసము (Self Confidence) 8. ఆత్మ సంతృప్తి (Self Satisfaction) 9. ఙ్ఞాపకశక్తి (Memory Power) 10. సంకల్పశక్తి (Thought Power) ఇవన్నియు మనలో పెరిగి 11. దివ్యచక్షువు ఉత్తేజితం (Thirdeye Activation) మరియు 12. సూక్ష్మశరీరయానం (Astrol Travelling) జరుగుతుంది.

-ధ్యానం చెసే పద్ధతి-
        అనువైన ప్రదేశంలో హాయిగా సుఖాసనంలో కూర్చొని, చేతి వ్రేళ్ళను ఒక దానితో ఒకటి కలిపి వుంచి, రెండు కళ్ళను నెమ్మదిగా మూసివుంచాలి. మనస్సులో ఏ నామాన్ని గాని మంత్రాన్ని గాని ఉచ్ఛరించరాదు. ఏ దేవతా రూపాన్ని, గురు రూపాన్ని గాని ఊహించరాదు. మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస-నిశ్వాసలను (లోనికి వెళుతున్న గాలిని-బయటకు వస్తున్న గాలిని) గమనిస్తూ వుండాలి. మధ్య మధ్యలో వచ్చే అనేకనేక ఆలోచనలని ఎప్పటికప్పుడు "నిలిపి" వేస్తూ (ఆలోచనలని వదిలించుకొని) మళ్ళీ మళ్ళీ మన ధ్యాసను శ్వాసమీదకు మరల్చాలి. మధ్యలో ఎట్టి పరిస్థితులలోను కళ్ళు తెరవకూడదు. మన శ్వాసను మత్రమే గమనిస్తూ వుండగా మనస్సు ఆలోచనారహిత స్థితికి చేరుకుంటుంది. ఈ స్థితిలో వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి అపారంగా శరీరంలోకి ప్రవేశించి మన నాడీ మండలాన్ని శుద్ధి  చేస్తుంది. తద్వారా మనలోని శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. ధ్యానం ముగించిన తరువాత మీ రెండు చేతి వ్రేళ్ళను కళ్ళ మీదకు తీసుకొని వచ్చి 5సెకన్లు మీచేతి వ్రేళ్ళను కళ్ళ మీద తాకి వుంచాలి. అలా ఉంచడం ద్వారా మీ చేతి వ్రేళ్ళలో మిగిలివున్న విశ్వశక్తిని తిరిగి శరీరంలోనికి ప్రవేశింప చేస్తాము. 5 సెకన్ల తరువాత మీ చేతి వ్రేళ్లను తీసివేస్తూ నెమ్మదిగా కళ్లు తెరవాలి. ఈ ధ్యానాన్ని గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాలక్రితం "ఆనాపానసతి" గా పేర్కొన్నారు. "ఆన" అంటే "ఉచ్ఛ్వాస" - "అపాన" అంటే "నిశ్వాస" - "సతి" అంటే "కూడుకుని వుండడం". అందుకే బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ గారు "శ్వాస మీద ధ్యాస" అని చెప్పారు. అంటే "మనశ్వాసతో మనం కూడుకుని వుండడమే" శ్వాస మీద ధ్యాస అని అర్థం. మీరు ఎన్నో ధ్యాన పద్ధతులను చూసి వున్నా వాటన్నిటిలోకి ఒకే ఒక్కటి 'సరి అయిన ధ్యాన పద్ధతి' ఆనాపానసతి మాత్రమే. ఈ ఆనాపాన సతి...సర్వరోగనివారిణి, సర్వభోగకారిణి, సత్యఙ్ఞానప్రసాదిని. ఈ ఆనాపానసతిని(ధ్యానం) చేయువారు, ఎవరి వయస్సు ఎంతనో అంతసేపు ధ్యానం చేయాలి. ఉదాహరణకు 30సంవత్సరముల వయస్సు వున్నవారు కనీససమయం 30 నిముషాలు చేయాలి. రోజుకి కనీసం 2సార్లు చేయాలి. అనారోగ్యంతో వున్నవారు ఒక రోజులో 4 నుంచి 5సార్లు, వారి వయస్సుకన్నా ఎక్కువ సమయం ధ్యానానికి కేటాయించాలి. 

                    ధ్యానం చేయడానికి కుల, మత, ప్రాంత భేధాలు లేవు. పిల్లలైనా, పెద్దలైనా, వయోవృద్ధులైనా, పురుషులైనా, స్త్రీలైనా, విద్యార్థులైనా, వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, ఏ ప్రాంతంవారైనా, ఎవరైనా చేయవచ్చు, ఎపుడైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. 

                          గర్భంతో వున్న ఏ స్త్రీ అయినా ముందు నుంచే ధ్యానం చేస్తే ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా కూడా లాభం పొందుతారు. ధ్యానం వలన తల్లుల మానసిక, శారీరక స్థితులు బాగుండటమే కాకుండా యోగీశ్వరులు పుట్టే అవకాశం వుంది.
                    
            విద్యార్థులు ధ్యానం చేయడం వలన మెదడులోని న్యూరాన్లు యాక్టివేట్ అయి అధిక చైతన్యశక్తిని సంగ్రహిస్తాయి. ఈ న్యూరాన్లు చాలా ఉత్తేజంతో ప్రకంపనాలు చేస్తాయి. దీనివలన మెదడు ఆరోగ్యవంతంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా వున్నప్పుడు శరీరంలోని అవయవాలన్ని సరియైన రీతిలో స్పందిస్తాయి. శారీరక ఆరోగ్యం పటిష్టంగ ఉంటుంది. ఈ ధ్యానం వలన విద్యార్థులలోని చైతన్యశక్తి మనొశక్తిగా మార్పు చెంది ఇంటెలిజెన్స్ గణనీయంగా పెరుగుతుంది. వారిలో బుద్ధివికాసం వృద్ధి చెందుతుంది. పిల్లలకు 3 సంవత్సరాల నుంచి ధ్యానం నేర్పించవచ్చు.

                ధ్యానం ఒక అక్షయపాత్ర. సరిగ్గా చేయాలే కానీ సాధ్యం కానిది అంటూ వుండదు.శ్వాస మీద నిరంతరం ధ్యాస వుంచితే ప్రపంచాన్నే కాదు విశ్వాన్నే జయించవచ్చు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే తమకు తాము సుఖంగా ఉండటమే కాకుండా చుట్టూ ఉన్నవారిని కూడా సుఖసంతోశాలతో జీవింపజేయగలరు.



పిరమిడ్ ధ్యానం
                                   ప్రకృతిలో సహజంగా ఉండే భూమ్యాకర్షణ శక్తి మరి విశ్వంలోని విశ్వశక్తి (కాస్మిక్ ఎనర్జీ) పిరమిడ్ ఆకారంలో ఇమిడి వున్న కొలతల ప్రత్యేకతల వలన ఈ ప్రాణశక్తి పిరమిడ్ లో సూక్ష్మీకరింపబడి శక్తివంతమైన జీవశక్తిగా మారి పిరమిడ్ లో ధ్యానం చేసేవారికి అద్భుత ఫలితాలను ఇస్తుంధి. గణిత సిద్ధాంతరిత్యా ప్రత్యేక కోణంలో నిర్మించబడిన పిరమిడ్లు విశ్వశక్తిని లోపలికి గ్రహించి నిల్వ చేస్తాయి. లోపల ఏర్పడే శక్తి క్షేత్రంలో పౌన:పున్యం (ఫ్రీక్వెన్సీ) తగ్గి అందరికి శక్తి అందుబాటులో ఉంటుంది. అతీతమైన మానవ శక్తులకు మూలం ఈ శక్తి. 

                   పిరమిడ్ లో కూర్చొని ధ్యానంలో నిమగ్నమైనపుడు మన శరీరంలోని ప్రాణశక్తి, పిరమిడ్ శక్తి క్షేత్రంలో కలిసినప్పుడు మనలోనికి అపరిమితమైన శక్తి ప్రవేశిస్తుంది. అన్ని రకాల అనారోగ్యముల నుంచి స్వస్థత పొందడానికి, మానసిక ప్రశాంతతకు, ఆత్మదర్శనానికి ఈ శక్తి ఉపయోగపడుతుంది. పిరమిడ్ శక్తివలన శరీరంలోని సకల కణాలు, కణ జాలాలు, సకల అవయవాలు అన్ని గొప్ప స్థాయిల్లో పని చేసే సామర్థ్యాన్ని పొందుతాయి. ఇందు వలన దీర్ఘాయుష్షు కూడా సాధ్యం. పిరమిడ్ అద్భుతశక్తి వలన కలిగే సత్ఫలితాలను తేలికగా, చవగ్గా పొందవచ్చు. మనం చేయవలసిందల్లా దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వెళ్ళడం లేదా ఇంట్లొనే పిరమిడ్ ను నిర్మించుకోవడం లేదా ఇంట్లోనే పిరమిడ్స్ ను తయారు చేసుకుని సర్వరోగనివారణిగా ఉపయోగించుకోవాలి. 



ధ్యాన స్థితిలో అనుభవాలు
                   శరీరం చాలా తేలికకావడం, తల, శరీరం బరువు కావడం, శరీరంలో అనేక ప్రాంతాలలో కదలికలు, నొప్పులు, శరీరం ముందుకు, వెనుకకు ఊగడం, శరీరంలోని రుగ్మతలు వున్న ప్రాంతంలో నవ్వలుగాను, చీమలు పాకుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇవన్నీ శారీరక రుగ్మతలు తొలగేటప్పుడు ఇలా జరుగుతుంది. అంతేగాకుండా నిశ్చల స్థితిలో ధ్యాని అనేక రంగులు, వలయాలు, వృక్షాలు, కొండలు, కోనలు, జలపాతాలు, పరమగురువులను వీక్షించగలిగే అద్భుత అనుభూతికి లోనవడం జరుగుతుంది. ధ్యానం చేస్తున్నవారందరికీ ఇలాగే జరగాలని కూడా లేదు. ఒకొక్కరి అనుభవం ఒకోరకంగా ఉంటుంది.

ప్రస్తుతం ధ్యానం చేస్తున్నవారు
                            ఈ విధమైనటువంటి ధ్యానం చేస్తున్నవారిలో కొన్నివేలమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రపంచ బ్యాంకులో పని చేస్తున్నవారు, ఉన్నతమైన పదవులలో ఉన్నవారు, నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థలలో పనిచేస్తున్నవారు, మన శార్ (ఇస్రో) అంతరిక్ష పరిశోధనా సంస్థలో వున్న శాస్త్రవేత్తలు, సుమారు 100 దేశాలలోని ఎంతోమంది ప్రజలు, మనదేశంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఈ ధ్యానం చేస్తున్నారు. సాధారణ ప్రజలని (ధ్యానం చేయనివారిని), ధ్యానం చేస్తున్నవారిని అడగండి వారు ఎలా జీవిస్తున్నారో మీకు తెలుస్తుంది. మీరు ధ్యానం చేస్తే మీకే తెలుస్తుంది. కొంతమంది మాకు పనులున్నాయి సమయం లేదు అని అంటుంటారు కాని వారికి 10 సంవత్సరాల తరువాత పనులేమైన తగ్గుతాయా? లేదా 20 సంవత్సరాల తరువాత పనులేమైనా తగ్గుతాయా? లేదే! పనులన్నవి జీవితాంతం అందరికీ వుంటాయి ఎప్పటికీ తరగవు. మనం ఆరొగ్యంగా, ఆనందంగా జీవించాలంటే కొంతసమయాన్ని మనకోసం మనం ఏర్పరుచుకోవాలి. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని, ప్రేమని పొందడానికి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేదు, ఏ నియమ నిభంధనలు ప్రత్యేకంగా పాటించనవసరం లేదు. నిత్య జీవితంలో ప్రతి రోజు కొంత సమయం కేటాయించుకుని చేయవలసిందల్లా ఒక్కటే-అదే 'ధ్యానం'.